Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ(ఎం) పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపు
నవతెలంగాణ-నేలకొండపల్లి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను నిరసిస్తూ ఈనెల 17న హనుమకొండలో సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా 25న నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ(ఎం) పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని సిపిఐ(ఎం) కార్యాలయం రావెళ్ల సత్యనారాయణ భవనంలో పార్టీ మండల జనరల్ బాడీ సమావేశం పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ బిజేపీ చేస్తున్న కుట్రలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జన చైతన్య యాత్రల పేరుతో మూడు జాతాలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి అనాగరిక చర్యల నుండి దేశ ప్రజలను కాపాడేందుకు చేస్తున్న యాత్రలలో రైతాంగం, కూలీలు, కార్మికులు, మేధావులు, కవులు, కళాకారులు, అభ్యుదయవాదులు అన్ని వర్గాల ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కెవి.రామిరెడ్డి, నాయకులు రచ్చ నరసింహారావు, ఏటుకూరి రామారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, రాసాల కనకయ్య, దుగ్గి వెంకటేశ్వర్లు, భూక్య కృష్ణ, కట్టెకోల వెంకటేశ్వర్లు, సిరికొండ ఉమామహేశ్వరి, మారుతి కొండలరావు, డేగల వెంకటేశ్వరరావు, మందడపు మురళీకృష్ణ, బండి రామమూర్తి, ఎడ్ల తిరుపతిరావు, శీలం అప్పారావు, పెద్దిరాజు నరసయ్య పాల్గొన్నారు.