Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి
నవ తెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
శ్రామిక మహిళల హక్కుల సాధనకై ఉద్యమించండి అని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి అన్నారు. సోమవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ ప్రాంతంలో ఐద్వా త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మం ప్రకాష్ నగర్ మిర్చి గోడౌన్లో మహిళలతో సభ నిర్వహించారు. ఈ సభకు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ అధ్యక్షత జరిగిన సభలో మాచర్ల భారతి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. మోడీ ప్రభుత్వం రాకముందు 450 రూపాయలన్న గ్యాస్ ఇప్పుడు 1150 రూపాయలు అయిందన్నారు. అంతేకాకుండా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రిజర్వేషన్ మాటనే మర్చిపోయా రన్నారు. మహిళలకు ఈ దేశంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. అనేకమంది మీద లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం వాళ్ళను చూసి చూడనట్లు వదిలేస్తా ఉంది అన్నారు. వాళ్లకి కఠినమైన శిక్షలు విధించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే అనేక చోట్ల మహిళలు వివిధ రంగాల్లో పనిచేస్తున్న చోట అనేక ఇబ్బందులు గురి అవుతున్నారన్నారు. సరైన సౌకర్యాలు లేక నానా రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ఈ దేశంలో గూండాలకు, రాక్షసులకు, పెట్టుబడిదారులకు వెన్ను కాస్తున్నది మోడీ ప్రభుత్వం అని, వెంటనే ఈ విధానాలను మార్చుకోకపోతే మహిళా సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి మహిళలను చైతన్య పరుస్తామని మోడీ గద్దె దిగే వరకు పోరాటం చేస్తామని ఆమె అన్నారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకులు బుగ్గవీటి సరళ, సిఐటియు ఖమ్మం జిల్లా నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, ఎర్ర శ్రీకాంత్, భూక్య శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా నాయకులు మాదినేని రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చింతల రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు షేక్ హిమాం, వివిధ ప్రజా సంఘాల నాయకులు పిన్నింటి రమ్య, పత్తిపాక నాగ సులోచన, అమరావతి, బాగా అజిత, వంగూరి రమాదేవి, లీల, శ్రామిక మహిళా నాయకులు ధనలక్ష్మి, యాకమ్మ, యాకయ్య, వడ్లమూడి నాగయ్య, శ్రీనివాసరావు, హెచ్.బుజ్జి తదితరులు పాల్గొన్నారు.