Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కొణిజర్ల
దేశంలో బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమాలలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. మంగళవారం సిపిఎం మండల విస్తృతస్థాయి సమావేశం దొడ్డపనేని కృష్ణార్జునరావు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి 9 సంవత్సరాల పరిపాలనలో దేశం సర్వనాశనం అయిందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ శక్తుల కనుసనల్లో ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. బిజెపిని గద్దెదించడమే లక్ష్యంగా పోరాడుతున్న సిపిఎం ఉద్యమాలను ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైరా నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ, రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం కోసం సిపిఎం ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర ఈ నెల 17న ప్రారంభమవుతుందని 22న వైరా నియోజకవర్గ కేంద్రంలో వేలాది మందితో జరుగు బహిరంగ సభను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జన చైతన్య యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, మండల కార్యదర్శి చెరుకుపల్లి కుటుంబరావు, బోయినపల్లి శ్రీనివాసరావు, మంగా చెన్నారావు, చల్లా నారాయణ, తాళ్లపల్లి విజయ, తాత పద్మ, తేజవత్ సీతారాములు, చింతపల్లి ప్రసాద్, బానోతు హరిచంద్, బొడ్డుపల్లి వీరభద్రం, పగిడిపల్లి కాటయ్య, బలమోల యోహాన్, తాతా నాగేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.