Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్
నవతెలంగాణ- కూసుమంచి
మోడీ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 24న మండల కేంద్రంలో జరిగే జన చైతన్య యాత్రను, బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో మల్లెల సన్మతరావు అధ్యక్షతన జరిగిన సిపిఎం మండల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బిజెపి ప్రభుత్వం పాలనలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై ఆర్థిక భారాలను మోపిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. మత విద్వేషాలను, రెచ్చగొట్టి దేశ లౌకిక వ్యవస్థను బిజెపి పాలను ధ్వంసం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కారల్ మార్క్స్ 130 వర్ధంతి సందర్భంగా మండల జనరల్ బాడీ లో పాల్గొన్న పార్టీ సభ్యులు నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల ఇంచార్జీ బుగ్గవీటి సరళ, మండల కార్యదర్శి యడవెల్లి రమణారెడ్డి, మండల కమిటీ సభ్యులు తోటకూరి రాజు, బిక్కసాని గంగాధర్, యర్రబోయిన భారతి, మూడు గన్య నాయక్, చిట్టూరి వెంకన్న, చీర్ల రాధాకృష్ణ, తాళ్లూరి వెంకటేశ్వర్లు, పందిరి వీరారెడ్డి, కర్ణబాబు, శీలం జానయ్య, రెడ్డిమల్ల వెంకటయ్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.