Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16న ప్రారంభించనున్న భట్టి విక్రమార్క
- విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
నవతెలంగాణ- ఖమ్మం
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ నెల 16న ప్రారంభించనున్న హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (సంజీవరెడ్డి భవనం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎల్పీ నేతగా ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్త్తంగా పాదయాత్ర నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గం బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ప్రారంభమై ఖమ్మం జిల్లాలో ముగుస్తుందని, మొత్తం 39 నియోజకవర్గాలలో 1365 కిలోమీటర్ల యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. యాత్రలో భాగంగా మూడు బహిరంగ సభలు ఉంటాయని, మంచిర్యాల, హైదరాబాద్ శివార్తో పాటు, ఖమ్మంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అరాచకాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టడానికి ఖమ్మం జిల్లా వాసికి దక్కడం చాలా సంతోషకరమన్నారు. భట్టి విక్రమార్కకి మద్దతుగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో వైరా నియోజకవర్గ పిసిసి సభ్యులు వడ్డే నారాయణరావు, నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు దుదుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, పల్లెబోయిన భారతీచంద్రం, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్ది వీరారెడ్డి, బానోత్ బాలాజీ నాయక్, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.