Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మండలంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ సభ్యుడు కత్రం భద్రయ్య (96) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. భద్రయ్య మృతదేహాన్ని సిపిఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ సందర్శించి భద్రయ్య మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జీవితాంతం ఎర్రజెండా నీడలో బతికిన వ్యక్తి భద్రయ్య అన్నారు. భద్రయ్య కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. మృతునికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు కత్రం ఉపేందర్ సిపిఎం పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. భద్రయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో సిపిఎం నాయకులు తమ్మినేని వెంకట్రావు, వరగాని మోహన్‌రావు, రంజాన్ పాషా, వడ్లమూడి నాగేశ్వరరావు, వరగాని వెంకటేశ్వర్లు, కోటి శ్రీనివాసరావు, గుర్రం మన్సూర్, కొత్త దుర్గయ్య, కొత్త శ్రీనివాసరావు, తుపాకుల ఉపేందర్, సర్పంచ్ తాటికొండ సుదర్శన్‌రావు, తెలపూడి కిషన్‌రావు తదితరులు ఉన్నారు.