Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల ప్రాణాలు హరిస్తున్నా పట్టించుకోని అధికారులు
- చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి ధర్నా
నవతెలంగాణ - ఎర్రుపాలెం
పెద్ద గోపవరం నుండి భీమవరం గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులలో భాగంగా గత నాలుగు సంవత్సరాల క్రితం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తూతూ మంత్రంగా రోడ్డు పనులను పూర్తి చేశారు. కానీ అసంపూర్తిగా కల్వర్టులు నిర్మించకుండా వదిలివేయడం వలన కల్వర్టుల దగ్గర మోటార్ సైకిల్ ప్రమాదాలు జరుగుతూ ఇప్పటికీ నలుగురు మృతి చెందినా రోడ్డు భవనాల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని పభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, టిడిపి నాయకులు అయ్యవారిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గోసు రామారావు, మిత్ర పక్షాల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ప్రజలతో కలిసి పెద్దఎత్తున మంగళవారం ప్రమాదం జరిగి చనిపోయిన కల్వర్టు దగ్గర ధర్నా నిర్వహించారు. ఎర్రుపాలెం మండల పరిధి లోని అయ్యవారిగూడెం - భీమవరం గ్రామాల మధ్య గల రోడ్డు మార్గంలో అసంపూర్తి గా ఉన్న కల్వ ర్టు దగ్గర ప్రమాదాలకు నిలయంగా మారిందని, వాటిని వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌పై తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్మాణంలో ఉన్న కల్వర్టుల దగ్గర హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేయాలని, చనిపోయిన కుటుంబాలకు గాయపడిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, త్వరతగతిన కల్వర్టుల పనులు పూర్తి చేసి ప్రమాదాలను నిలవరించాలని, మరొక ప్రాణం బలి కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని, ఆర్అండ్బి అధికారులను డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్సై సురేష్ పోలీసు బృందంతో ఆ ప్రాంతానికి చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆర్అండ్బి అధికారులతో చర్వాణి ద్వారా చర్చలు జరిపి, నాయకులతో సంప్రదించి అనంతరం ధర్నాను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు నరసింహారావు, శీలం శ్రీనివాస రెడ్డి, తలపరెడ్డి సీతారామి రెడ్డి, పొట్టేటి వెంకట్ నారాయణ రెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు గొల్లపూడి కోటే శ్వరరావు, నల్లమోతు హనుమంతరావు, షేక్ జానీ, దివ్వెల వీరాంజనేయులు, అనుమోలు కోటేశ్వరరావు, నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు వంకాయలపాటి జగన్, అనుమోలు కుటుంబరావు, ప్రజలు, పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు.