Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్వారావుపేట అభివృద్ధి బాధ్యత నాదే
- ఆయిల్ ఫాం సాగుకు ఈ ప్రాంతం ఆదర్శం
- మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజక వర్గం అభివృద్ధి నాదే బాధ్యత అని, ఈ ప్రాంతం అన్ని రకాలుగా ముందంజలో ఉండటానికి నేను అన్ని వేళలా కృషి చేస్తానని రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ రవాణా అధారిటీలో విభాగం అయిన అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం మంగళవారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్టీఓ వేణుతో కలిసి ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. నా తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు బుడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వేలేరుపాడు, అశ్వారావుపేట ప్రాంతాల్లో అనేక పోరాటాలు నిర్వహించారని, మా తాత ఈ ప్రాంతం తిరిగిన నేలని దీంతో నా మూలాలు ఇక్కడనే అని గుర్తు చేసారు. నా రాజకీయ జీవితం ఈ ప్రాంతం నుండే ప్రారంభం అయిందని అన్నారు. అశ్వారావుపేట అంటే తనకెంతో అభిమానం అని ఈ ప్రజలు సేవ కోసం నా జీవితాంతం కృషి చేస్తానని తెలిపారు. ఆయిల్ ఫాం సాగుతో ఈ ప్రాంతం యావత్ తెలంగాణ కే ఆదర్శంగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణకు ముఖం ద్వారంగా ఉన్న అశ్వారావుపేట అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించారు. ముందుగా ఆయన మండల పరిధిలోని మద్దికొండలో నివాసం ఉంటున్న మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు కాసాని వెంకటేశ్వరరావును పరామర్శించారు. అక్కడ నుండి జమ్మిగూడెంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో ఉన్న వృద్ధులోతో మాట్లాడారు. కంటి వెలుగు పరీక్షా పద్ధతిని పరిశీలించారు. డీఎంహెచ్ఓ శిరీష్‌తో కంటి వెలుగు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అశ్వారావుపేట మార్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీలో మంత్రి అజరు కుమార్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో స్వయంగా బుల్లెట్ నడుపుతూ సభావేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో అధికారికంగా ప్రారంభం అయిన మంత్రి పువ్వాడ అజరు కుమార్ పర్యటన రాజకీయ నినాదాలతో ముగిసింది. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మధుసూధన్ రాజు, ఆర్అండ్బీ భీంలా నాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేష్, డీఈ శేషాద్రి, ఎంపీపీ శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ వరలక్ష్మి, రైతు బంధు జిల్లా కన్వీనర్ రావు జోగేశ్వరరావు, దమ్మపేట జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, ఎంవీఐ జయ్ పాల్ రెడ్డి, శ్రీనివాస్, తహశీల్దార్ లూదర్ విల్సన్, ఎండీఓ విద్యాధర్ రావు, సీడీపీఓ రోజా రాణి, నాయకులు యు.ఎస్ ప్రకాశ్ రావు, కాసాని చంద్రమోహన్, మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.