Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవాళి విముక్తి మార్గము కమ్యూనిజం
నవతెలంగాణ-కొత్తగూడెం
మహౌన్నతమైన మానవత సిద్ధాంతం మార్క్సిజమని, మానవాళి విముక్తి మార్గము కమ్యూనిజమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో కార్ల్ మార్క్స్ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనకయ్య హాజరై మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ తన జీవితాన్ని మొత్తం పేద ప్రజలకే అంకితం చేశారని అన్నారు. కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి ప్రజలే ద్యేయంగా ఉద్యమాలు నిర్మించాలని అన్నారు. అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత కార్ల్ మార్క్స్‌ని అన్నారు. ఆనాటి కాలంలో సోషలిజం కోసం పనిచేసిన వ్యక్తి కార్ల్ మార్క్స్ అని తెలిపారు. కొంత మంది ఆయనకు సంపన్నులు అంటే ద్వేషమని అందుకే వారికి వ్యతిరేకంగా సిద్ధాంతం రూపొందించారని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇంకొందరు ఆయన మానవ హక్కుల గురించి పట్టించుకోలేదని విమర్శ చేశారని అన్నారు. కానీ మార్క్స్ గొప్ప మానవ వాది సమస్త మానవాళి విముక్తి చెందాలని ఆయన ఆకాంక్షించారని అన్నారు. మార్క్స్ పూర్తిగా ఆచరణ వాది కాబట్టి మనం ఆయన చూపిన మార్గంలో అడుగులు ముందుకు వేయడం ద్వారా ఆయనకు వాళ్లు అర్పించాలని అన్నారు. ప్రస్తుతం మార్క్స్ ఆలోచనలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. యావత్ ప్రపంచం ఒక కొత్త వెలుగు కోసం ఎదురుచూస్తుందన్నారు. ఆ వెలుగుకు సంబంధించిన మార్క్స్ అందించిన సందేశాన్ని వారికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహారావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, పట్టణ కమిటీ సభ్యులు డి. వీరన్న, విజయగిరి శ్రీనివాస్, సమ్మయ్య, వై వెంకటేశ్వరరావు, రమేష్ బాబు, పవన్ తదితరులు పాల్గొన్నారు.