Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ గురుకులం ఆధ్వర్యంలో నడపబడుతున్న యుఆర్జెసీ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్నందున పరీక్షా కేంద్రాలకు సంఖ్యను బట్టి రవాణా సౌకర్యంతో పాటు వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేకమైన అధికారులను నియమించడం జరిగిందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రూ తెలిపారు. యూఆర్జెసి (బాలికల) భద్రాచలం కళాశాలలో ఫస్ట్ ఇయర్లో 326, సెకండ్ ఇయర్లో 240 మంది విద్యార్థినీ, విద్యార్థులకు గాను నాలుగు సెంటర్లలో తరలించడానికి 8 బస్సులు, యుఆర్జెసి (బాలికలు) సుదిమల్ల ఫస్ట్ ఇయర్ 193, సెకండ్ ఇయర్ 141, మూడు సెంటర్లకు గాను నాలుగు బస్సులు, యుఆర్జెసీ (బాలురు) దమ్మపేట ఫస్ట్ ఇయర్ 106, సెకండ్ ఇయర్ 95 విద్యార్థినీ, విద్యార్థులకు మూడు సెంటర్లలో నాలుగు బస్సులు, యుఆర్జెసి( బాలురు) గుండాల ఫస్టియర్ 124, సెకండియర్ 102 లోకల్ ఎగ్జామ్స్ సెంటర్లకు ఆటోరిక్షాలు, యూఆర్జేసీ (బాలురు) కెఎస్డీ సైట్ ఫస్ట్ ఇయర్ 125, సెకండ్ ఇయర్ 116, నాలుగు ఎగ్జామ్స్ సెంటర్లకు నాలుగు బస్సులు, ఎస్ఓఈ (బాలురు) ఖమ్మం 82 ఫస్ట్ ఇయర్, 74 సెకండియర్, 33 ఎగ్జామ్స్ సెంటర్లకు 14 ఆటో రిక్షాలు, యుఆర్జెసి (బాలికలు) మణుగూ రు ఫస్ట్ ఇయర్ 58, సెకండ్ ఇయర్ 59, 2 సెంటర్లకు రెండు బస్సులు, యుఆర్జెసి( బాలికలు) అన్నపురెడ్డిపల్లి ఫస్ట్ ఇయర్ 59, సెకండ్ ఇయర్ 57, ఒక ఎగ్జామ్స్ సెంటర్కు రెండు బస్సులు, యుఆర్జెసి (బాలికలు) కొత్తగూడెం ఫస్ట్ ఇయర్ 59, సెకండ్ ఇయర్ 63, 5 ఎగ్జామ్స్ సెంటర్లకు 10 టాటా ఏసీ ఆటో రిక్షాలు, యుఆర్జెసి(బాలురు) సింగరేణి ఫస్ట్ ఇయర్ 26, సెకండ్ ఇయర్ 53, 2 ఎగ్జామ్స్ సెంటర్లకు రెండు బస్సులు, యుఆర్జెసి (బాలురు) తిరుమలేయపాలెం 41 ఫస్ట్ ఇయర్, 56 సెకండ్ ఇయర్, విద్యార్థినిలకు రెండు ఎగ్జామ్స్ సెంటర్లకు రెండు బస్సులు, (బాలికలు) అంకంపాలెం ఫస్ట్ ఇయర్ 159, సెకండ్ ఇయర్ 154, 3 ఎగ్జామ్స్ సెంటర్లకు 8 బస్సులు, యుఆర్జెసి(బాలురు) కృష్ణాసాగర్ ఫస్ట్ ఇయర్ 88, సెకండ్ ఇయర్ 872 ఎగ్జామ్స్ సెంటర్లకు నాలుగు బస్సులు, ఈఎంఆర్ఎస్ గండుగుల పల్లి ఫస్ట్ ఇయర్ 72, మూడు ఎగ్జామ్స్ సెంటర్లకు ఒక బస్సు సత్తుపల్లి ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలుపుతూ విద్యార్థినీ, విద్యార్థులు సులభంగా పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేయడానికి ప్రత్యేక అధికారు లను నియమించడం జరిగిందని ఐటీడీఏ పీవో అన్నారు.