Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థలో జరిగే ఎన్నికల్లో కాలపరిమితి రెండు సంవత్సరాలుగా ఉండాలని సీఐటీయూ కోరింది. సింగరేణిలో సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించుట కోసం సింగరేణిలో రిజిస్టర్ అయిన 33 సంఘాలను హైద్రాబాద్ సీఎల్సీ పిలువగా అందులో 15 కార్మిక సంఘాలు 13వ తేదీన డిప్యూటీ సిఎల్సి ముందు హాజరైనాయి. సింగరేణిలో ఎన్నికలు గురించి పలు అంశాలపై చర్చించడం జరిగిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియూ) రాష్ట్ర కార్యదర్శి మందా నర్సింహారావు తెలిపారు. మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు ఎన్నికల కాలపరిమితి టిబిజికేఎస్, ఏఐటియూసీ, ఐఓన్టియూసి, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు నాలుగేండ్ల పదవీ కాలం ఉండాలని ప్రతిపాదించాయి, డిప్యూటీ సిఎల్సి కూడా సెంట్రల్ కోడ్ ఆఫ్ డిసిప్లేన్ ప్రకారం రెండు సంవత్సరాలకే ఎన్నికల కాలపరిమితి ఉంటుందని తెలిపారని చెప్పారు. సింగరేణి వ్యాప్తిత గుర్తింపు, ఏరియాలో ప్రాతినిధ్యం వహిస్తున్నందున రెండు గుర్తింపులకు రెండు ఓట్ల సిస్టం ఉండాలని సిఐటియు ప్రతిపాదనను టిజిబికేఎస్, ఎఐటియూసీ, ఐఎన్టియూసీ, హెచ్ఎంఎస్ తప్ప మిగతా సంఘాలు అంగీకరించాయి. దీనిని పరిశీలిస్తామని డిప్యూటీ సిఎల్సి చెప్పారు. ఎన్నికల గుర్తింపు కాలపరిమితి అనంతరం ఎన్నికలు నిర్వహించేంత వరకు అన్ని కార్మిక సంఘాలను సమానంగ చూడాలనే ప్రతిపాదనకు అంగీకరించారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మార్పుకు డిప్యూటీ సిఎల్సి అంగీకరించలేదని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు ఓటు హక్కు ఉండాలని సిఐటియు ప్రతిపాదనను అన్ని యూనియన్లు సమ్మతిని తెలియజేశాయి. హెచ్ఎంఎస్ మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకు సపరేట్ ఎన్నికలు నిర్వహించాలని వారి అభిప్రాయాన్ని చెప్పారు. ఈ అంశాన్ని డిప్యూటీ సిఎల్సి అంగీకరించలేదు. తదుపరి సమావేశం 2 ఏప్రియల్ 2023న హైదరాబాదులో నిర్వహించి అందులో ఎన్నికల షెడ్యూల్ను ఫైనల్ చేసుకోవాలని నిర్ణయం జరిగింది. ఎన్నికల షెడ్యూలు 45 రోజుల్లో పూర్తి చేసుకోవటానికి డిప్యూటీ సిఎల్సి ప్రతిపాదన చేయగా సింగరేణి యాజమాన్యం బొగ్గు లక్ష్యం దృష్ట్యా రెండు నెలలు సమయం కోరిందన్నారు. దానిపై డిప్యూటీ సిఎల్సి అంగీకరించలేదన్నారు. 12 (3) ప్రకారం ఆర్ఎల్సి సమక్షంలో చేసుకున్న ఒప్పందం అమలు పై ఏ) అండర్ గ్రౌండ్ అన్ ఫిట్ అయిన మైనింగ్ సూపర్ సూపర్వైజర్స్, టెక్నీషియన్లకు మరియు ఇపి ఆపరేటర్స్ వారికి సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ అమలు కు నోటు సర్కులేషన్లో ఉన్నదని, అతి త్వరలో అమలు చేస్తామన్నారు. బి) మారుపేర్ల విషయంలో పై స్థాయి అధికారులని తో మాట్లాడండి, మేమేమీ చెప్పలేము అని తెలియజేశారు. పెండింగ్ సమస్యలపై కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో బి.మధు ధర్నా నిర్వహించారన్నారు. వారితో మేనేజ్మెంట్ డిప్యూటీ సిఎల్ సి చర్చించి అగ్రిమెంటై యైన బోనస్ పై కమిటీ వేసాము అతి తొందర్లో పరిష్కారం చేస్తామని తెలియజేశారు. హాస్పిటల్ సౌకర్యం విషయంలో డాక్టర్లు కొరత దృష్ట్యా అమలు చేయలేమని మేనేజ్మెంట్ చెప్పిన దాని పై అగ్రిమెంట్ చేసుకుని అమలు చేయకుండా ఉండటం కరెక్ట్ కాదని కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు సిఐటియు నాయకులు వాదించారు. కనీసం అగ్రిమెంట్ చేసుకున్న అంశాలైన తప్పకుండా అమలు చేయాలని పట్టుబట్టారు. ఈ విలేకర్ల సమావేశంలో కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, వై.వెంకటేశ్వరరావు, కె.రమేష్ బాబు, ఎస్.సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.