Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్తి నష్టం రూ.2లక్షలు
- కన్నీరు మున్నీరు అవుతున్న బాధితులు
నవతెలంగాణ-చండ్రుగొండ
అర్ధరాత్రి మంటలు వ్యాపించి హోటల్, కిరాణా షాపు పూర్తిగా దగ్ధం అయినా ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. అయ్యన్నపాలెం గ్రామంలో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. రోజువారిగా హౌటల్ నడుపుకుంటూ బతుకు వెళ్లదీసుకుంటున్న వారి జీవితం ఒక్కసారిగా మంటలు వ్యాపించి బూడిద పాలు కావటంతో చిరు వ్యాపారి కుటుంబం కన్నీరు మున్నిరుగా విలపించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో గవినీ రమణ, అతని కుమారుడు రాంబాబు, హౌటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హౌటల్ పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వెళ్లగా అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించి హౌటల్ పూర్తిగా దగ్దంమైనది. మంటలు వ్యాపించటంతో పక్కనే ఉన్న వేముల త్రిమూర్తుల కిరాణా షాపు కూడా మంటలు అంటుకోవటంతో కిరాణా షాపు కూడా దగ్ధమైనది. అర్ధరాత్రి కావడంతో చుట్టుపక్కల జనాలు వచ్చేలోపే పూర్తిగా మంటలు అధికమై నష్టం వాటిల్లింది. హోటల్ పూర్తిగా దగ్ధం కావడంతో జీవనాధారం కోల్పోయామని హోటల్ నిర్వాహకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సుమారు రెండు షాపుల మీద రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని వారు తెలిపారు. ఘటన పై పలు అనుమానాలు ఉన్నాయని, ఎవరో కావాలని ఇలా చేసి ఉంటారని బాధితులు భావిస్తున్నారు. హోటల్ వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్నామని అగ్నిప్రమా దంతో సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమని ఆదుకొని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.