Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం టౌన్
రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన ఉద్యమకారులను ఆదుకోవాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఉద్యమకారుల సంక్షేమకారుల ఆధ్వర్యంలో మంగళవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఉద్యమకారుల నిరసనకు మద్దతు తెలిపిన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులను కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ ప్రజల్లో మొట్టమొదటిగా దగా పడింది ఉద్యమకారులేనని ఆరోపించారు. కవితను ఈడీ విచారణకు పిలిపిస్తే ఆమెకు మద్దతుగా మంత్రివర్గంలో ఉన్న తన కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీశ్ రావులతో పాటు అనేకమంది మంత్రులు, కార్యకర్తలను ఢిల్లీకి పంపించి సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించిన తీరు యావత్తు తెలంగాణ సమాజానికి విస్మయానికి గురిచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, బరిగడ దేవదానం, హుస్సేన్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు నబీ, తెలంగాణ విభిన్న ప్రతిభవంతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ గుండపనేని, గౌస్, ఉబ్బెన శ్రీను, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.