Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళ్లకు ట్యాగ్లు, రెక్కలకు స్టాంపు
- భయపడాల్సిన అవసరం : ఎస్ఐ
నవతెలంగాణ - ఎర్రుపాలెం
తమిళనాడు రాష్ట్రం లోని తంజావూరులో పావురాల పోటీలు నిర్వహిస్తారని అట్టి పోటీలలో పాల్గొన్న పావురం ఆకాశంలో విహరించి తిరిగి తన గమ్యం స్థానానికి వెళ్ళ వలసిన పావురం దారి తప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించడంతో ప్రజలు పావురాన్ని చూసి గందరగోళ పరిస్థితులలో పావురం కలకలం రేపింది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎర్రుపాలెం మండల పరిధిలోని మామునూరు గ్రామంలో పావురాన్ని గుర్తించి పట్టుకొనగా దాని రెక్కల పైన డెల్టా 1000 కేఎం అని స్టాంపు ముద్రించగా, కాళ్లకు వేసిన ట్యాగ్లు ఒక కాలికి 999 టీఎన్ అని మరొక కాలుకి 1417 అని ఉన్నట్లు తెలిపారు. విచారించగా ఓ సంస్థకు చెందిన ఆర్గనైజర్లు పక్షుల జాతికి చెందిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అట్టి పోటీలలో భాగంగానే అది మామునూరు గ్రామంలో అలిసిపోయి వాలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, మండల వాసులు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరంలేదని ఎస్సై సురేష్ తెలిపారు.