Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా మునిసిపాలిటి 10వ వార్డు (సోమవరం)లో ఉన్న వాటర్ హెడ్ ట్యాంక్‌ను కూల్చింది ఎవరో విచారణ జరపాలని మునిసిపల్ కమీషనర్ అనిత బుదవారం పోలీసులకు పిర్యాదు చేశారు.1988లో సోమవరం గ్రామ అవసరాల కోసం 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 90 వేల లీటర్ల సామర్ధ్యం గల వాటర్ హెడ్ ట్యాంక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేశారని, విచారణ జరిపి ఆ వ్యక్తుల వివరాలు తెలపాలని మునిసిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటర్ హెడ్ ట్యాంక్‌ను 12-12-2022న భారీ జేసిపితో పట్టపగలు కూల్చిన విషయం పాఠకులకు విదితమే. ఈ విషయమై ఫిబ్రవరి 22న మునిసిపల్ కౌన్సిలర్లు 16 మంది మంచి నీటి ట్యాంక్‌ను అక్రమంగా కూల్చి వేశారని, స్థలాన్ని 1983 ట్యాంక్ నిర్మాణం కోసం ఇచ్చిన స్థల యజమానికి ఇచ్చినట్లు చైర్మన్ పై పిర్యాదు చేస్తూ ఈ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు కూడా జిల్లా కలెక్టర్ విపి గౌతం కు ఫిర్యాదు చేశారు. కారణాలే మిటోగాని ట్యాంకు కూల్చిన 90 రోజుల తర్వాత ట్యాంకు కూల్చింది ఎవరో తేల్చాలని కమిషనర్ అనిత పిర్యాదు చేయటం మునిసిపల్ రాజకీయాలలో కొత్త మలుపు. కమిషనర్ ఇచ్చిన పిర్యాదు విషయమై వైరా ఎస్ ఐ శాఖమూరి వీర ప్రసాద్‌ను వివరణ కోరగా ట్యాంక్‌ను తాము కూల్చలేదని, ఒకవేళ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూల్చి వేసి ఉంటారేమోనని ఆ శాఖ అధికారులను వివరణ కోరగా వారు కూల్చలేదని తెలిపినట్లు కమిషనర్ పిర్యాదులో పేర్కొన్నారు. అందువలన మంచి నీటి ట్యాంక్‌ను ఎవరు కూల్చారో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎస్ ఐ తెలిపారు. ఆర్ డబ్ల్యు ఎస్ డి ఈ నవీన్ వివరణ ప్రకారం కమీషనర్ లేఖకు సమాధానం ఇచ్చామని ట్యాంక్ శిధిలావస్థకు చేరిందో లేదో తమకు తెలియదని, తమ శాఖ ఆద్వర్యంలో ఎప్పుడూ ఎలాంటి పరీక్షలు చేయలేదని, దాని నాణ్యతా ప్రమాణాలకు సర్టిఫికెట్ చేయలేమని స్పష్టం చేశారు. ట్యాంకులను మునిసిపాలిటీకి అప్పగించామని, వాటి బాగోగులు, నాణ్యతలు మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులే చూసుకోవాలని నవీన్ స్పష్టం చేశారు.వాటర్ హెడ్ ట్యాంక్ కూల్చటం,దానిలో ఉన్న పాత ఇనుమును ఒక తాత్కాలిక ఉద్యోగి ప్రవేట్ కాంట్రాక్టర్‌కు 20 వేలకు అమ్ముకున్నట్లు వార్తలు వచ్చినవి. మూడు నెలల తరువాత ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరటం మునిసిపాలిటీలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో బాగంగా ఉన్నట్లు తెలుస్తుంది.