Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ - బోనకల్
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన జన చైతన్య యాత్ర ఈనెల 22వ తేదీన బోనకల్ మండల కేంద్రానికి చేరుకుంటుందని, ఈ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. మండల పరిధిలోని రావినూతల గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని నున్నా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన జన చైతన్య యాత్రను జయప్రదం చేయడం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని కోరారు. ఇందుకోసం అన్ని గ్రామాలలో వెంటనే విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సిపిఎం నాయకులను కోరారు. బహిరంగ సభ జయప్రదం కోసం వెంటనే ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రణాళిక బద్ధంగా సిపిఎం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, నాయకులు కొమ్ము శ్రీనివాసరావు, తుళ్లూరు రమేష్, మర్రి తిరుపతిరావు, గుగులోత్ పంతు, గుగులోతు నరేష్ పాల్గొన్నారు.