Authorization
Fri April 04, 2025 08:17:45 am
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
గత కొన్ని రోజులుగా మండల కేంద్రములో జరుగుతున్న రేగా క్రికెట్ కప్ టోర్నీలో ఆళ్ళపల్లి ఎ టీం విజేతగా నిలిచింది. ఈ టోర్నీ ఫైనల్స్‌కు ఆళ్ళపల్లి ఎ టీం, బోడాయికుంట గ్రామం టీంలు చేరాయి. ఏక పక్షంగా జరిగిన ఫైనల్లో బోడాయికుంట టీం పై ఆళ్ళపల్లి ఎ టీం ఘన విజయం సాధించింది. రేగా టోర్నమెంట్ విజేతకు కప్ అందజేయడానికి విప్ రేగా కాంతారావు హాజరై, కప్‌తో పాటు రూ.20000 నగదు, రన్నరప్ టీంకు స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి కప్‌తో పాటు రూ.15000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుండాల కోఆపరేటివ్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాయం నరసింహారావు, షేక్ బాబా, ఉపాధ్యక్షుడు కొమరం వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి మొహమ్మద్ ఖయ్యుం, టోర్నీ నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఆరీఫ్, మొహమ్మద్ ఆదం, తదితరులు పాల్గొన్నారు.