Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జన చైతన్య యాత్ర
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-చర్ల
రైతులు పండించే పంటలకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరల చట్టం చేయాలని, ప్రజా వ్యతిరేకమైన నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జనచైతన్య యాత్రను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మార్చి 17వ తేదీన హనుమకొండలో ప్రారంభమవుతున్న యాత్ర మార్చి 19వ తేదీన చర్ల మండల కేంద్రానికి చేరుకుంటుందని ఈ సందర్భంగా చర్లలో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు, దళితులు, ఆదివాసీలపై బీజేపీ పాలనలో దాడులు పెరిగాయని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని, ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నీరుగాచుతుందని, ఈ చట్టాల రక్షణకు సీపీఐ(ఎం) పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. 19 జరిగే బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన,్ మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మీడియా బాబురావు, తదితర ముఖ్య నేతలు అందరూ పాల్గొంటారని, బహిరంగ సభను విజయవంతం చేయాలని చర్ల మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, మండల కార్యదర్శి కారం నరేష్, మండల కమిటీ సభ్యులు మచ్చా రామారావు, తదితరులు పాల్గొన్నారు.
జన చైతన్య యాత్రకు సంపూర్ణ మద్దతు
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు మండలం శ్రీ గణేష్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ఆటో యూనియన్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పామర్ బాలాజీ, సంపత్ తెలిపారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో ఆటో యూనియన్ సమావేశం నిర్వహించారు. మార్చి 19వ తేదీన చర్ల మండలానికి జనచైతన్య యాత్ర వస్తున్న సందర్భంగా యాత్ర నాయకులకు స్వాగతం పలకాలని యాత్రను విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి మాట్లాడారు. ఈ సమావేశంలో చర్ల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ శివ, కేవీపీఎస్ మండల కార్యదర్శి మచ్చ రామారావు, ఆటో యూనియన్ నాయకులు సంజీవ్, పోతురాజు, ప్రసాద్, వేణు, అజరు కుమార్, కే.రాంబాబు, శంకర్, శివ,తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం జనచైతన్య యాత్రకు వేలాదిగా పార్టీశ్రేణులు తరలి వచ్చి బహిరంగసభను చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య పిలుపునిచ్చారు. గురువారం మారాయిగూడెం గ్రామంలో పార్టీ జనచైతన్య యాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పుల్లయ్య మాట్టాడుతూ ఈ యాత్ర 20వ తేదీన దుమ్ముగూడెం చేరుకుంటుందన్నారు. ముసలిముడుగు గ్రామం నుండి భారీ మోటార్ సైల్ ర్యాలీతో లకీëనగరం చేరుకుని స్టేట్ బ్యాంకు ముందు బహిరంగసభను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మారాయిగూడెం సర్పంచ్ తొడెం తిరుపతిరావు, నాయకులు సున్నం వెంకటేశ్వర్లు, సోంది ఎడమయ్య, ఎర్రయ్య, భూపతి, కొమరయ్య, శ్రీరాములు, రాముడు, వీరస్వామి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : బీజేపీ ముసుగులో ఆర్ఎస్ఎస్, మనువాద ఎజెండాను అమలు చేస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర చేపట్టడం జరుగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అశ్వారావుపేట మాజీ సర్పంచ్ కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. శుక్రవారం నుండి ప్రారంభం అయ్యే ఈ యాత్రల వాల్ పోస్టర్ను గురువారం ఆయన అశ్వారావుపేటలో ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అర్జున్, మండల కన్వీనర్ చిరంజీవి, మడిపల్లి వెంకటేశ్వరరావు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.
ములకలపల్లి : జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం నందు జన చైతన్య యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, మధు, లక్ష్మి నరసయ్య, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, జోగయ్య, రవి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : ఈ నెల 17 నుండి 29వ తేదీ వరకు జరిగే సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రల వాల్ పోస్టర్లను మండల బృందం గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలను మోపుతూ దేశంలో పేదలను మరింత పేదలు చేస్తూన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పెద్దిన్ని వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి, శాఖ కార్యదర్శిలు చల్లపల్లి రాజా, అప్పాడి నాగేశ్వరరావు, కాంతారావు, చింతల భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ, ఉపాధి నిరుద్యోగ, బృతి నిత్య అవసర ధరలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర మార్చి 17 నుండి 29 వరకు జరిగే యాత్రను జయప్రదం చేయాలని లక్ష్మీదేవి పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గోడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి యూ.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.