Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
హైద్రాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యుల బృంద సహకారంతో ఈ నెల 25, 26వ తేదీన కొత్తగూడెం క్లబ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. క్యాన్సర్ గుర్తింపు క్యాంపుకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ విజరు కుమారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ అనుమానిత లక్షణాలతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ క్యాంపుకు హాజరయ్యేవారు ముందుగా 9885630479, 9391190522, 9848283201, 9849293823 ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పదవీ విరమణ విద్యుత్ శాఖ అధికారి కొంగర రామచంద్రరావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు జీవివి ప్రసాద్, రొటీరియల్ ఎం.వెంకటేశ్వర్, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ చలం, కోడుమూరి శ్రీను, శ్రీనగర్ కాలనీ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్ చంద్, టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గుండపునేని, యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షులు బిక్కులాల్ (బాలు), గుమలాపురం సత్యనారాయణ, షేక్ దస్తగిరి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.