Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనులు పురోగతిని పరిశీలన
నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజక వర్గంలోని అశ్వా రావుపేట మండలంలోని మారుమూల ఏజన్సీలోని రెడ్డిగూడెం, గోగులపుడి, గుబ్బల మంగమ్మ గ్రామాల్లో ఐటీడీఏ భద్రాచలం పీఓ పోట్రు గౌతం గురువారం విస్తృతంగా పర్యటించారు. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిన ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసారు. పనులు జరిగే తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు. ముందుగా రెడ్డిగూడెం పంచాయతీ సుద్ద గోతుల గూడెంలో రూ.43 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డును, రూ.11.2 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి భవనాన్ని పరిశీలించారు. కావడిగుండ్ల పంచాయతీ గోగులపుడిలో రూ.16 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్, రూ.15 లక్షలతో నిర్మించిన నైపుణ్యం ప్రదర్శన భవనం సందర్శించారు. గుబ్బల మంగమ్మ దేవాలయం ప్రాంగణంలో రూ.11.2 లక్షలతో నిర్మించిన వ్యాపార సముదాయ గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, స్థానిక సర్పంచ్లు యాట్ల మహేశ్వర రెడ్డి, గొంది లక్ష్మణ్, కంగాల భూ లక్ష్మీ, పీటీజీ ప్రత్యేక అధికారి సురేష్ బాబు, ఐటీడీఎ ఇంజనీరింగ్ విభాగం డీఈ రామిరెడ్డి, ఏఈ ప్రసాద్, తహశీల్దార్ లూదర్ విల్సన్, ఎంపీడీఓ విధ్యధర రావు, ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహ్మాన్, ఎంపీఈఓ సీతారామరాజు, సీడీపీఓ రోజా రాణి, కార్యదర్శులు పాల్గొన్నారు.