Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
పేద ప్రజలకోసం అహర్నిశలు శ్రమిస్తాన, కొత్తగూడెం మున్సిపల్ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహకారంతో అభివృద్దికి బాటలు వేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు అన్నారు. గురువారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వనమా మాట్లాడారు. కొత్తగూడెం పట్టణంలోని కూరగాయల మార్కెట్ యార్డు వ్యాపారులకు ఇచ్చిన మాట ప్రకారం నూతన మార్కెట్ నిర్మాణం చేయనున్నామన్నారు. మున్సిపాల్ పరిధిలోని 33వ వార్డులో సుమారు రూ.1కోటితో నిర్మించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం నిలుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నానని తెలిపారు. ఎవరేమనుకున్నా కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలో నిలపడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, గణేష్ టెంపుల్ చైర్మన్ శంకర్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ , ఉర్దూఘార్ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్లు రావి మమత, బాలిశెట్టి సత్యభామ, రైతు బజార్ వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.