Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని తూరుబాక గ్రామంలో ప్రభుత్వం వారిచే అన్ని అనుమతులు పొందిన శ్రీ వెంకటేశ్వర గిరిజన కోపరేటివ్ ఇసుకు క్వారీ పనులను గిరిజన మహిళలు గురువారం స్వచ్చందంగా ప్రారంభించారు. క్వారీ పనులను తూరుబాక ఉపసర్పంచ్ బొల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రత్యేక చొరవతో తాము గిరిజన మహిళా సొసైటీగా ఏర్పడి ప్రభుత్వం వారిచే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఇసుక క్వారీ పనులు ప్రారంభించినట్లు సొసైటీ అద్యక్షురాలు మాలోత్ నీల, కార్యదర్శి కన్నెబోయిన వెంకటరమణలు తెలిపారు. మేము స్వచ్చందంగా ఇసుకు క్వారీ నిర్వహించుకునేందుకు అన్ని విదాలా సహకరించిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య, తూరుబాక ఉపసర్పంచ్ బొల్లి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞ్నతలు తెలిపారు. సొసైటీ సభ్యులు, గ్రామస్తులకు సహకారంతో ఇసుక సొసైటీని సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వీరన్న, తులసీరామ్, శంకర్, గుమ్మడి శ్రీను, రాములు, మళ్లికార్జున్, సాయిబాబు పాల్గొన్నారు.