Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలి
- టీఎస్ పీఎస్ చైర్మన్ రాజీనామా చేయాలి
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం టౌన్
టీఎస్ పిఎస్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించి దీని వెనుక ఎవరు ఉన్నా మొత్తం బయటకు తీయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ప్రశ్నపత్రాల లీకేజీలో టీఎస్ పిఎస్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశతో ఎదురు చూస్తున్నన్నారని తెలిపారు. హాస్టళ్లలో ఉంటూ, లక్షలాది రూపాయలు కోచింగ్‌లకు ఖర్చు చేస్తూ నానా ఇబ్బందులు పడ్డ నిరుపేద నిరుద్యోగులకు ఈ ఘటన తీవ్ర నష్టదాయకమని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్ పిఎస్ చైర్మన్, కార్యదర్శి, మొత్తం సభ్యుల పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్రూప్-1 పేపర్లు కూడా లీకైనట్లుగా వార్తలు వస్తునందున్న గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గంధం మల్లికార్జున్ రావు, సాయి, నాగుల రవికుమార్, చెనిగారపు నిరంజన్ కుమార్, మాలోత్ వీరు నాయక్, అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు.