Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్‌కు దీటుగా పాఠశాల
- అయిదు తరగతులకు ఇద్దరు టీచర్లు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రభుత్వం పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా పునరుద్ధరణ చేస్తున్నప్పటికీ సిబ్బంది కొరతను మాత్రం తీర్చలేక పోతుంది. దీంతో పేరు గొప్ప ఊరు దిబ్బ లా ప్రభుత్వ విద్య కనారిల్లుతుంది. ఈ చిత్రంలో కనిపించేది ప్రభుత్వం పాఠశాల భవనం. మండలంలోని అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల. ఇది మన ఊరు-మన బడి పధకంలో అభివృద్ధి అయి చూడటానికి ప్రయివేట్ పాఠశాల కంటే మౌళిక వసతులు కల్పించారు. ఇటీవలనే రాష్ట్రమంత్రి అజరు కుమార్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతులు మీదుగా ప్రారంభం జరిగింది. గురువారం ఆ పాఠశాలను నవతెలంగాణ సందర్శించిన సమయంలో ఒకటో తరగతి పిల్లలకు అందులో ఓ విద్యార్ధి బోధన చేస్తున్నాడు. కారణం ఉపాధ్యాయులు ఇద్దరు. తరగతులు ఐదు. రెండేసి తరగతులను ఒకే గదిలో కూర్చోబెట్టి ఉన్న ఇద్దరు పాఠాలు చెప్తుండగా ఒకటో తరగతిలో వారికి వారే చెప్పుకొనే లా సిబ్బంది ఏర్పాటు చేసారు. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు మొత్తం నలుగురు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరే విధులు నిర్వహిస్తున్నారు. మరో ఇద్దరు వేరే అధికారిక విధుల్లో ఉన్నారు అన్నమాట. ప్రధానోపాధ్యాయులు కమల, విరేశ్వరరావు, లక్ష్మీ నర్సు, రామక్రిష్ణ మొత్తం నలుగురు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు. అయితే రామక్రిష్ణ ఉపాధ్యాయుడిని పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తుండగా, లక్ష్మీ నర్సు అనే ఉపాధ్యాయులు ఇంటర్ పరీక్షలకు పర్యవేక్షకు లుగా విధుల్లో ఉన్నారు. దీంతో అయిదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారు.