Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ మాడూరి ప్రసాద్
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు పథకం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు 39వ డివిజన్ కార్పొరేటర్ మాడూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక 25వ డివిజన్లో సూరేపల్లి చిరంజీవి కమిటీ హాల్ బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని కార్పొరేటర్ మాడూరి ప్రసాద్‌తో స్థానిక కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ కలిసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ పేద కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు అమలు చేస్తున్నట్లు తెలిపారు.కంటి వెలుగు శిబిరంలో వైద్యులు అందుబాటులో ఉండి పరీక్షలు చేసిన అనంతరం వారికి అవసరమైన కంటి అద్దాలను అందించడం జరుగుతోందని తెలిపారు.కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటుగా మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైద్యులు తబస్సుమ్, రామకృష్ణ, ఏఎన్ఎం లక్ష్మి ప్రసన్న, సూపర్వైజర్లు జైపాల్, వెంకట్ రెడ్డి, స్టాఫ్ నర్సులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.