Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రయివేట్‌పరం చేయడం మానుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర గోడ పత్రికను పత్తి మార్కెట్ యాడ్‌లో ఆవిష్కరించారు. సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన సభలో యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే చట్టాలను చేస్తా ఉందని, కార్మికుల యూనియన్ల దెబ్బతీసే విధంగా యూనియన్లు పెట్టుకోకుండా పోరాటాలు చేయకుండా కార్మిక కోడ్లను రద్దు చేస్తా ఉందన్నారు. మతోన్మాదం సృష్టించి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కుతంత్రాలు చేస్తా ఉందని అన్నారు. ముస్లిం మైనార్టీల మీద, దళితుల మీద దాడులు చేస్తా ఉందన్నారు. వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల నుండి జనచైతన్య యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. శుక్రవారం వరంగల్‌లో మొదలైన జన చైతన్య యాత్ర ఈనెల 23 వ తారీఖున ఖమ్మం గాంధీచౌక్‌లో సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ జరుగుతుంది అని అన్నారు.ఈ బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు, కార్మిక వర్గం అత్యధికంగా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు 35వ డివిజన్ కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు, షేక్ సైదులు, షేక్ హిమామ్, రంగు హనుమంత చారి, కార్మిక సంఘ నాయకులు హెచ్ పేరయ్య, తాళ్లూరి రామకష్ణ, రాజేష్, లకావత్ బాలు, తడికమళ్ళ రమేష్, బాదావత్ బద్రు, పంది స్వామి, తదితరులు పాల్గొన్నారు.