Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టుతుంది
- బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకే 'జనచైతన్య యాత్ర'
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమ, మతసామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రంలో మార్చి 17 నుండి 29వ తేదీ వరకు జన చైతన్య యాత్రలు నిర్వహిస్తుంది. ప్రజలు, ప్రజా స్వామికవాదులు, లౌకిక వాదులు, మేధావులు ఈ కార్యక్రమంలో భాగస్వాలవుతున్నారు. దేశంలో బీజేపీ ఒకే భాష పేరుతో హిందీ సంస్కృత్వాన్ని రుద్దే ప్రమాదకర చర్యలకు పాల్పడుతుంది. విద్యలో జ్యోతిష్యాన్ని, సంస్కృతాన్ని పాఠ్యాంశాలుగా మార్చారు. ఒకే మతం అంటూ హిందూ ఇతర మతాలపై దాడులు సాగిస్తున్నారు. దళిత, గిరిజన, మహిళ, మైనార్టీ, బీసీలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. రాజ్యాంగ యంత్రాంగం దుర్వినియోగం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గవర్నర్ల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ నాయకులతో నింపి రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు. బీజేపీ యేతర ఇతర ప్రభుత్వాల పట్ల నిరంకుశ వైఖరి కొనసాగిస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రశాంత తెలంగాణలో మతాల మధ్య చెచ్చుపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి గద్దె నెక్కాలని రాజకీయ వికృత క్రీడ ఆడుతుంది. చైతన్య వంతమైన తెలంగాణ ప్రజల ముందు ఈ మాయ ఆటలు సాగవని చెప్పడం కోసమే, మతోన్మాద విధానాలు అడ్డుకునేందు ప్రజలను చైతన్య పరిచే దిశగా జనచైతన్య యాత్ర ముందుకు సాగుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తెలిపారు.
జిల్లాలోకి యాత్ర...
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర ఈనెల 19వ నుండి 21 వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెంలో సాగనుంది. 3 రోజుల పాటు సాగే జనచైతన్య యాత్ర విజయవంతం చేసేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 19వ తేదీ సాయంత్రం యాత్ర జాత ప్రారంభమవుతుంది. 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు జూలూరుపాడు మంలంలోకి ప్రవేశిస్తుంది. మూడు రోజుల పాటు అనేక సభలు, సమావేశాలు, భారీ మోటారు బైక్ ర్యాలీలు, ప్రజా నాట్యమండలి కళాకారుల ఆట, పాటలు, నృత్య ప్రదర్శనలు దారి పొడుగునా ప్రజలను చైతన్యం చేయ నున్నాయి.
బహిరంగ సభలు....
జన చైతన్య యాత్ర ఈనెల 19వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం చర్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మూడు రోజులపాటు జాత పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ సందర్భంగా చర్ల బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో వేలాదిమంది పాల్గొంటారు. రాత్రి జాత బృందం చర్లలో బస చేస్తారు. 20వ తేదీ దుమ్ముగూడెం, లక్ష్మీపురంలో బహిరంగ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెం చేరుకుంటుంది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు సుజాతనగర్ చేరుకుంటుంది. అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు జూలూరుపాడు చేరుకుంటుంది. ఈ విధంగా మూడు రోజులు చైతన్య యాత్రలో భాగంగా సభలు ఏర్పాటు చేయడం జరిగింది.
కమిటీల ఏర్పాటు..నిర్వహకులు
జన చైతన్య యాత్ర విజయవంతానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 రోజుల పాటు సాగే జన చైతన్య జాత విజయవంతం కోసం 7 కమిటీలు ఏర్పాటు చేశార. కమిటీలకు పలువురు నాయకుల నిర్వహణలో పనులు చేస్తారు.
వసతుల కమిటీకి : మచ్చ వెంకటేశ్వర్లు, కొండపల్లి శ్రీధర్ తదితరులు.
భోజనాల కమిటీ : ఎంబీ నర్సారెడ్డి, కె.బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, ఎం.జ్యోతి
మెటీరియల్, ఏర్పాట్ల కమిటీ : అన్నవరపు సత్యనారాయణ తదితరులు
మీడియా-సోషల్ మీడియా కమిటీ : భూక్యా రమేష్, బి.వీరభద్రం, నవీన్, సతీష్
ప్రదర్శనలు, బహిరంగ సభ నిర్వహణ : ఏజే.రమేష్, తదితరులు
వాహనాలు మెయింటెనెన్స్ : కొక్కెర పార్టీ పుల్లయ్య తదితరులు
మోటారు వాహనాల నిర్వహణ : రేపాకుల శ్రీనివాస్ తదితరులు ఉంటారు.
జన చైతన్య యాత్ర జాతకు మఖ్యనేతలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజుల పాటు సాగే జన చైతన్య యాత్రలో పలువురు సీపీఐ (ఎం) నేతలు పాల్గొంటారు. ఇందులో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, యాత్రలో నాయకులు కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగన్న, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్లు పాల్గొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. విద్యుత్ సంస్కరణ బిల్లులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిలబడింది. ప్రజా సమస్యల పట్ల కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు చిత్తశుద్దితో కృషి చేయాలి. అలా చేయకపోతే ప్రజలు పోరాటానికి సిద్ధమవుతారు. బీజేపీ వ్యతిరేక పోరాటం బలహీనపడే అవకాశం ఉంటుంది. భూమికోసం...భుక్తి కోసం...వెట్టి చాకికి విముక్తి కోసం.. మట్టి మనుషులే తుపాకులై జమీందారులను తరిమి, రజాకార్లను గడగడలాడించి నిజాం సర్కర్నే గద్దె దింపిన మహత్తర వీర తెలంగాణ సాయుధ రైతంగా పోరాట చరిత్ర తెలంగాణది. బందిలుగా చిందించిన రక్తం. చిట్యాల ఐలమ్మ వీరత్వం....దొడ్డి కొమరయ్య తొలి అమరత్వం...నాలుగు వేల మంది రక్త తరఫునతో తడిసిన తెలంగాణ గడ్డ....ఆ చరిత్రని వశీకరించి, అధికారం చేపట్టాలని కుట్రతో బిజెపి తెలంగాణలో రంకలేస్తుంది. ప్రజాస్వామ్యం గాలికి వదిలేసి కులం, మతం, విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. తమ వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టుతుంది. 8 ఏళ్ల నుండి ప్రజలకు చేసినవి చెప్పుకోడానికి ఒక్క పని కూడా లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. ప్రజా కవి సుద్దాల హనుమంతు స్ఫూర్తితో...'' వీర వెరు వెరు దెబ్బ వెరు వీరతెలంగాణ పేరు నిలపగా వెరు....'' మతోన్మాద పీచమణచగా అందరం కలిసి నినదిద్దాం. మతోన్మాదం నశించాలని, కార్పొరేట్ స్వామ్యం నశించాలని నినదిద్దాం.
మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు అంశాన్ని మూలన పడేసారనీ, భేటీ బచావో, బేటీ పడావో నిధులు దుర్వినియోగం చేసారన్నారు. బీజేపీ మతోన్మాద, కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఈ యాత్ర జరుగు తోందనీ ప్రజలు, మీడియా, అభ్యుదయవాదులు, మేధావులూ, ప్రజాస్వామిక వాదులు, లౌకిక శక్తులు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొనాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య స్పష్టం చేశారు.