Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
ప్రభుత్వవం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎంపీపీ గుమ్మడి గాంధీ తెలిపారు. శుక్రవారం పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మండల కేంద్రంలో గల ఎంపీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. ఎంపీటీసీ సత్యం, ఎల్చిరెడ్డి పల్లి సర్పంచ్ నాగభూషణం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరబద్రం, జూనియర్ అసిస్టెంట్ గణపతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భవాని శంకర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి సత్తిబాబు, వార నరసింహరావు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.