Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మండలంలోని సుభాష్ నగర్ కరెంట్ ఆఫీస్ ఏరియాలో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రారంభించారు. శిబిరంలో కంటి పరీక్ష చేయించుకుంటున్న రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో సైతం కంటి పరీక్షలు నిర్వహించి నిరుపేదలకు ఉచితంగా కళ్లద్దాలు, మాత్రలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ఖమ్మంలో జరిగిన సీఎం కేసీఆర్ సభలో పలు రాష్ట్రాల సీఎంలు కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ నుఅభినందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, సర్పంచ్ వల్లాల మంగమ్మ, మండల కో ఆప్షన్ గాజి తదితరులు పాల్గొన్నారు.