Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరానికి రూ.50వేలు తుఫాన్ పరిహారం ఇవ్వాలి
- సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-చర్ల
అకాల వర్షం కారణంగా చర్ల మండలంలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆ రైతులకు జరిగిన నష్టాని ప్రభుత్వం వెంటనే అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, మండల కార్యదర్శి కారం నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురు, శుక్రవారం కురిసిన వర్షాలకు రైతులు ఆరుగాలం పండించి కళ్లాల్లో నిలువ చేసుకున్న మిర్చి పంట మొత్తం తడిసిపోయాయని, ఫలితంగా మిర్చి నాణ్యత మాత్రం దెబ్బతిని పోతుందని, అందువల్ల ఏర్పడిన నష్టానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) కోరింది. రైతులకు జరిగిన నష్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.25000, కేంద్ర ప్రభుత్వం మరొక రూ.25 వేలు కలిపి మొత్తం రూ.50000 చొప్పున మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.