Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం అమలు చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
- వీవోఏల టోకెన్ సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు
- రెండో రోజుకు చేరుకున్న టోకెన్ సమ్మె
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర ప్రభుత్వం వీఓఏలతో వెట్టి చాకిరి చేపిస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. వీవోఏలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న టోకెన్ సమ్మె శుక్రవారం రెండవ రోజుకు చేరుకుంది. కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో జరుగుతున్న సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కనీస వేతనం అమలు చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆయన డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అనేక పథకాలను ప్రజల వద్దకు చేరుస్తూ ఉన్నటువంటి అనేక మహిళా పొదుపు సంఘాలను ఆర్థికంగా ఆదుకుంటూ, అనేక పుస్తక నిర్వహణ చేస్తూ పనిచేస్తున్నటువంటి వీవోఏల ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకుండా వారికి చాలీచాలని వేతనాలు ఇస్తుందని ఆయన విమర్శిం చారు. పని ఒకరిది ఫలితం మరొకరిది అన్న చందంగా వీళ్ళు పనిచేస్తుంటే ఉద్యోగులు ఫలితం పొందుతున్నారని, వీరిని కూడా సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన కోరారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ పాల్గొని మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 17965 మంది వీవోఏలు 34 జిల్లాల్లో టోకెన్ సర్వే నిర్వహిస్తున్నారని, చాలా పెద్ద సంఖ్యలో తుఫాను సైతం లెక్కచేయకుండా ఈ పోరాటం నడుస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వీరి సమస్యలను వెంటనే పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పాల్వంచ పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్ తమ సంఘీభావాన్ని మద్దతుని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో. సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, కే.సత్య, వివోఏ జిల్లా కోశాధికారి చంద్ర లీల, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీను గోపాల్, రేష్మ మై మునిసా తదితరులు పాల్గొన్నారు.