Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
సీపీఐ(ఎం) చేపడుతున్న జనచైతన్య యాత్ర ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంటలకు జూలూరుపాడు మండలానికి చేరుకోనుంది. ఈ యాత్రకు బహిరంగ సభ నిర్వహించేందుకు సీపీఐ(ఎం) బృందం మండల కేంద్రంలో స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ 17వ తారీఖున హన్మకొండలో ప్రారంభమైన జనచైతన్య యాత్ర 19వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కి చేరుకొని 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు జన చైతన్య యాత్ర జూలూరుపాడు చేరుకుంటుందని అన్నారు. యాత్రలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, యాత్ర రథసారథి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కమిటీ సభ్యులు వీర్ల రమేష్, మండల కార్యదర్శి యసా నరేష్, మండల కమిటీ సభ్యులు గార్లపాటి వెంకటి, వళ్లమల చందర్రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ పాల్గొన్నారు.