Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు అండగా నిలిచిన పోలిశెట్టి వెంటే మేము
- తెలంగాణ నగర్ వాసులు వెల్లడి
నవతెలంగాణ-పాల్వంచ
ఎన్నో పోరాటాలు అవమానాలు నిర్బంధాలు ఎదుర్కొని సాధించుకున్న తెలంగాణ నగర్లో ఎన్నడు పట్టించుకోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకోవాలని తెలంగాణ నగర్ వాసులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తెలంగాణ నగర్ వాసులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నందిగామ వెంకటరమణ, మిర్యాల రాధ, కారకపల్లి స్వరూప, బొల్లెద్దు భవాని, మాలోత్ ప్రశాంత్, బియ్యని విజరు, షేక్ సొంద్ సాహెబ్ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల క్రితం ఒక కబ్జా కోరు చేతిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఇల్లు లేని నీరు పేద కుటుంబాలకు పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ 12 ఏండ్ల తెలంగాణ నగర్ విలువైన స్థలాన్ని ఎలాగైనా కబ్జా చెయ్యాలని కొందరు చెయ్యని ప్రయత్నం లేదని ఆ ప్రయత్నానికి పాల్వంచలోని కొంత మంది రాజకీయ నాయకులు మద్దతు కూడ ఉంది. మా తెలంగాణ నగర్ కాలనీని ఎలాగైనా కాళి చేయించాలని అనేక కుట్రలు పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన మేము అంత పొనిశెట్టి వెంకటేశ్వర్ల నాయకత్వంలో పోరాటం చేసామన్నారు. మా కాలనీకి మౌలిక వసతులు ఇవ్వకుండా సదురు కబ్జా కోరు హై కోర్టులో ఐదు కేసులు వేసిన మేము తల ఇంత డబ్బులు పోగు చేసుకొని న్యాయ పోరాటం చేసి గెలిస్తే ఇప్పుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు తన వ్యక్తిగత ఇమేజ్ కోసం తెలంగాణ నగర్లోని కొందరిని చేరదీసి ఇన్ని రోజులు చెయ్యని సహాయం చెయ్యడం వెనుకే అర్ధం అవుతుందన్నారు. తెలంగాణ నగర్లో చిచ్చు పెట్టడానికి వనమా వెంకటేశ్వరావు, వనమా రాఘవేంద్రరావు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వరహాలరావు, శంకర్, వెంకన్న, ఉపేందర్, రుద్రా, హాథిరామ్, కిరణ్, రమేష్, శ్రీను, కేశవులు, వీరన్న, కిట్టు, నాగమణి, మణెమ్మ, రమ, అనిత, దీప్తి, విజయ, బేబీ, యకుబి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.