Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భోజనశాలలో పరిశుభ్రత పాటించాలి
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్ అనుదీప్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని, వసతి గృహాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్వాహన తీరును నిశితంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రూములో కెమెరాల రికార్డింగ్ ప్రక్రియ పనితీరును వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలలో రికార్డు అయిన ఫుటేజీలను భద్రపరచాలని ఆయన ఆదేశించారు. పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పరీక్షలు సజావుగా సక్రమంగా జరుగుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సీ రెసిడెన్షియల్ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన శాల అపరిశుభ్రంగా ఉందని ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. బియ్యం నిల్వలు పరిశీలించిన ఆయన బియ్యం సన్నగా లేవని, నాణ్యత లోపించిందని ఈ విషయమై నివేదిక అందజేయాలని ఆర్సిఓని ఆదేశించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. నమోదులు సక్రమంగా ఉండాలని, స్టాకు రిజిస్టర్ ప్రకారం ఉన్న నిల్వలు సక్రమంగా ఉండాలని చెప్పారు.