Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట నష్టం నమోదుకి మాత్రమే పరిమితం కాకుండా పరిహారం అందించాలి
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-కొణిజర్ల
వడగండ్ల వాన, గాలిదూమారానికి ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిందని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం కొణిజర్ల మండలం లాలాపురం తీగలబంజర, సిద్దిక్‌నగర్ గ్రామాల్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వడగండ్ల వానతో దెబ్బ తిన్న మొక్కజొన్న పంట, మిర్చి పంటలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ పంట నమోదు కంటితుడుపు చర్య కాకుండా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, మండవ బ్రహ్మమేశ్వరావు, ఎస్కె సిద్ధా, భాస్కర్, ప్రభాకర్‌రావు, పాసంగులపాటి రవి, పాటి శ్రీనివాసరావు, కోపెల భూషణం, రవి, బాబు తదితరులు పాల్గొన్నారు.