Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
దోపిడి ఆధిపత్యంకి వ్యతిరేఖంగా పోరాటమే మల్లు స్వరాజ్యంకి ఇచ్చే ఘనమైన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆదివారం స్థానిక మంచికాంటి భవన్లో మల్లు స్వరాజ్యం ప్రధమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ ''బాంచన్ దొర...నీ..కాళ్ళు మొక్కుత..'' అనే చేతులతో బందూకులు పట్టించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన ఘనత మల్లు స్వరాజ్యంది అని అన్నారు. చిన్న వయసులోనే తుపాకీ చేతపట్టి నిజాం నవాబుకి వ్యతిరేఖంగా పోరాడిన వీర వనిత మల్లు స్వరాజ్యం అన్నారు. ఆనాటి భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం జరిగిన పోరాటంలో ధీరోదాత్తమైన కృషి చేశార అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, పద్మ, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి సమ్మయ్య, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, నందిపాటి రమేష్, సలీం, వేణు, సరోజ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో...
భూమికోసం... భుక్తి కోసం... పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన వ్యక్తి మల్లు స్వరాజ్యం మని ఐద్వా పట్టణ కార్యదర్శి సందకూరి లక్ష్మి అన్నారు. ఆదివారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం ప్రధమ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ కార్యదర్శి లక్ష్మి మాట్లాడారు. తెల్లదొరలను ఎదిరించి పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమి పంచిన ఘనత మల్లు స్వరాజ్యంకు దక్కుతుందన్నారు. మహిళల అభివృద్ధికి, వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మల్లు స్వరాజ్యం అని, ఆమె స్ఫూర్తితో మహిళలు పోరాటాల్లోకి రావాలన్నారు. మన హక్కులు మనం సాధించుకోవాలని పిలపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు అన్నవరపు ఇందిరా, నందిపాటి రజిత, మెరుగు విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, అన్నవరపు పద్మ, సృజన తదితరులు పాల్గొన్నారు.