Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్(టీపీయండబ్ల్యూయు) ఐఎఫ్టియు అను బంధం జిల్లా ప్రధమ మహాసభ ఇల్లందు ఎల్లన్న విజ్ఞానకేంద్రంలో ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలీ తెలిపారు. మున్సిపల్ కార్మికుల ముఖ్యుల సమావేశం నాయిని కృష్ణ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మహాసభను జయప్రదంచేయాలని జిల్లా మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో మున్సిపల్ కార్మికుల సమస్యలపైచర్చించి భవిష్యత్ కార్యక్రమాలపై కార్మిక సమస్యలపై పోరాటలకు సిద్ధం చేసే విధంగా ఈ మహాసభ నిర్ణయంతీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ రాష్ట్రనాయకులు వేముల గురునాథం సిహెచ్ కుమార్ ఎం.డి ఫయాజ్ సంజీవ్, బోయపోతుల వెంకన్న బాలాజీ రాజు ఉపేందర్ సురేష్ పాల్గొన్నారు.