Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి నిబద్దత కలిగిన నాయకుడు బండి వీరభద్రం అని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా అన్నారు. ఆదివారం సింగరేణి హైటెక్ కాలనీలో జరిగిన అమరజీవి కామ్రేడ్ బండి వీరభద్రం సంతాపసభ మాట్లాడారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.సారయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపూరి బ్రహ్మం, జిల్లా నాయకులు రామచందర్, గోలియా తండా సర్పంచ్ నిరోషా మంగీలాల్ నాయక్, కోయగూడెం సర్పంచ్ ఉమా, ఉప సర్పంచ్ బండి రాధా, కుమారుడు విశాల్ భవాని తదితరులు పాల్గొన్నారు.