Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి చేతికి వచ్చిన పంట అంతా నేలపాలు అయ్యిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో రాజపురం గ్రామంలో ముందస్తుగా వరి నాట్లు వేయడంతో మరో వారం పది రోజుల్లో వరి పంట చేతికి వస్తుందని రైతులు ఎంతో సంతోషంగా ఉండటంతో ఆదివారం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి గణపతి రెడ్డి అనే రైతుది వరి మొత్తం పడిపోయింది. పలువురు రైతులు కోత దశకు రావడంతో గాలికి వర్షానికి సగానికి పైగా ధాన్యం రాలి నెలపాలు అయినాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్ని పెట్టుబుడులు పెట్టి చివరి దశలో ఇలా ప్రకృతి వైపరిత్యానికి రైతులు అతలాకుతలం కావడం చాలా బాధగా ఉంది అని వెంటనే సబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.