Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిరు వ్యాపారులకు భోజనం ఏర్పాటు
- వినాయకపురం జాతర పై వర్షం ప్రభావం
నవతెలంగాణ-అశ్వారావుపేట
నియోజక వర్గంలోనే పెద్ద జాతరగా పేరుగాంచిన అశ్వారావుపేట మండల పరిధిలోని వినాయకపురం శ్రీ శ్రీ శ్రీ చిలుకల గండి ముత్యాలమ్మ దేవాలయం ప్రాంగణం 5 రోజులపాటులో నిర్వహించే తిరునాళ్ళ పై వర్షం ప్రభావం పడింది. దీంతో ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు వర్షం కారణంగా నానా ఇక్కట్లకు గురయ్యారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అక్కడున్న సుమారు 300 మంది చిరు వ్యాపారులు, ఇతరులకు మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాటు చేసి వారి ఆకలిని తీర్చారు. ఈ భోజనం ఏర్పాట్లను స్వయానా ఎమ్మెల్యే మేనల్లుడు తాటి ప్రదీప్ చంద్ర పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సాంబశివ రావు, అశ్విన్, ప్రసాద్, ఉప్పల నాగు, రామినేని సురేష్, రవి, బాబు పాల్గొన్నారు.