Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేలకొరిగిన మొక్కజొన్న, రాలిన మామిడి
- తడిసిముద్దయిన మిర్చి కల్లాలు
- నీట మునిగిన వరి
- దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
- ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఐ(ఎం), ఎన్డీ
- ప్రభుత్వానికి నివేదిస్తాం : ఏవో సతీష్
నవతెలంగాణ-ఇల్లందు
అర్ధరాత్రి అకస్మాత్తుగా ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఉరుములతో దద్దరిల్లింది. బీభత్సాన్ని సృష్టించింది. రైతుకు కన్నీరు మిగిల్చింది. మండలంలో యాసంగీలో వేసిన పంటపొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంటలు పాడై రూ.50 లక్షల్లో నష్టాన్ని నమిగిల్చింది. దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. మండలంలోని పూబెల్లి, రాఘబోయిన గూడెం, మొండి తోగు, ముకుందాపురం ముసివాగు, కొమరారం, మాణి క్యారం, పోలారం, పోచారం, మర్రిగూడెం, బద్దుతండ, బొం బాయితండ, ఏడిప్పలగూడెం, రామకృష్ణా పురం, కోటన్న నగర్, తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. వందల ఎకరాల్లో మామిడి తోటలో మామిడికాయలు నేలరాలాయి. కళ్ళాల్లో మిర్చి తడిసి ముద్ద యింది. ప్రభుత్వం రైతుబంధు ఇచ్చినప్పటికీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ప్రతి ఒక్కటీ కొనుక్కోవా ల్సిందే. రైతుబంధు ఇస్తున్నామని ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తేసింది. పెరిగిన డీజిల్, కూలి రేట్లు ఎకరానికి వేళల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎంతో శ్రమించి పంటలు వేసుకుంటే అకాల వర్షాలతో ఉన్నదంతా ఊడ్చుకుపో యింది. దీంతో చేసిన అప్పులు తీర్చడం ఇల్లు గడవడం రైతులకు కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణం నష్టపరిహా రం చెల్లించి కష్టాలు తీర్చాలని రైతులకు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఐ(ఎం) : న్యూడెమోక్రసీ
గత నాలుగు రోజులుగా వీస్తున్న ఈదురు గాలులు, కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో వేల ఎకరాల్లో పంటలు పాడైనాయని ప్రభుత్వం ఆదుకోవాలని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవునూరి మధు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అబ్దుల్ నబీ ఆదివారం వేరువేరుగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. నష్టపోయిన పంటలను పరిశీలించాలని, 15 రోజుల్లో నష్టపరిహారాలు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మళ్లీ పంటలు వేసుకోవడానికి రైతులకు తగు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వానికి నివేదిస్తాం : ఏవో సతీష్
మండలంలో కురిసిన భారీ వర్షాలకు పాడైన పంటలను వ్యవసాయ శాఖ అధికారి సతీష్ ఆదివారం సందర్శిం చారు. మాణిక్యారం, కొమరారం, పోలవరం తదితర అనేక పంచాయతీలోని గ్రామాల్లో మొక్కజొన్న మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 480 ఎకరాల్లో మొక్కజొన్న, 2 రెండు ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు ధైర్యం చెప్పా మని, తగు సూచనలు చేశామని అన్నారు. నష్టపరిహా రాలు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.