Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న అద్దె బస్సుల డ్రైవర్లు, హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెం డిపో హైర్ బస్ డ్రైవర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏజే.రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగస్తులకు సమానంగా పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు తక్కువ వేతనాలు ఉన్నాయని, కనీస వేతన అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఒక్కటే అయినప్పుడు వేతనాలు ఎందుకు తేడా చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. యూనియన్లు పెట్టొద్దని, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయొద్దని, ఒకవైపు బీజేపీ ప్రభుత్వం మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులపై నిర్బంధాలను ప్రయోగించి ఉద్యమాలను విచ్చిన్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక హక్కులు కాల రాస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. అద్దె బస్సు కార్మికులకు వేతనాలు పెంచే వరకు దశలవారి ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. కార్మికుల పక్షాన సీఐటీయూ నికరంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, హెర్ బస్ అధ్యక్ష కార్యదర్శులు సైదులు, నరసింహా , కోశాధికారి గిరిబాబు, సంఘం సభ్యులు అందరు పాల్గొన్నారు.