Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకమునకు అవసరమైన దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న పుణ్య జలాలను సేకరించారు. భద్రాచలం అర్చక వైదిక కమిటీ 9 మంది అర్చక, వైదిక సిబ్బంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 పుణ్య నదీ జలాలు, 12 పుష్కరిణిల జలాలు, సముద్ర జలాలు తీర్ధాన్ని సేకరించి భద్రాచలం చేరుకున్నారు. పుష్కర నది జలాలకు ప్రత్యేక పూజలు చేసి, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ పూజలు చేసి శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు వైదిక సిబ్బంది తెలిపారు.