Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
ఉపరితల ద్రోని ప్రభావంతో మూడు రోజులగా కురుస్తున్న వర్షానికి మండల పరిధిలోని దుగునే పల్లి, జానంపేట, వెంకటరావుపేట, చింతల బయ్యారం, సింగిరెడ్డిపల్లి పలు గ్రామంలో మిర్చి పూర్తిగా తడిసిపోయింది. మండల వ్యాప్తంగా వందల ఎకరాల్లో మిర్చి పంట వర్షార్పణమయింది. రైతులు పట్టాలు కప్పిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. చేతికి వచ్చిన పంట తడిసి పోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మొక్కజొన్న, మామిడి తోటలకు సైతం వీస్తున్న ఈదురుగాలులతో మామిడి పిందెలు మొత్తం నేలరాలాయి. ఏది ఏమైనా ఈ అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.