Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
కామ్రేడ్ అమరజీవి మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దామని సిపిఎం రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో సిపిఎం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత కామ్రేడ్ అమరజీవి మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం వర్ధంతి వేడుకలలో సిపిఎం రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం దొరలకు వ్యతిరేకంగా బందూకు పట్టి పోరాటం చేసిన మహిళ రజాకార్ల అరాచకాలకు ఆగడాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిందని అన్నారు. మహిళలకు రక్షణగా నిలిచి, వారిని చైతన్యవంతం చేసే దాంట్లో కీలక పాత్ర పోషించిందన్నారు. గొరిల్లా దళాల్లో పనిచేసి మిగతా మహిళలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవడం మనమంతా కంకణ బద్దులమై ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శివర్గ సభ్యులు వజేనేపల్లి శ్రీనివాసరావు, పత్తిపాక నాగ సులోచన, షేక్ హిమామ్, షేక్ సైదులు, షేక్ బాబు, పోతురాజు జార్జి, రంగు హనుమంతచారి, మీనాల మల్లికార్జునరావు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,సిపిఐ (ఎం) నాయకురాలు వీరవనిత మల్లు స్వరాజ్యం ప్రధమ వర్ధంతిని సిపిఐ(ఎం) ఆధ్వర్యంల ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా సిపిఐ (ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల నాయకులు వేల్పుల భద్రయ్య, మందరపు పద్మ, మందరపు వెంకన్న,నెమిలి సైదులు, వెంకటాపురం సిపిఐ (ఎం) గ్రామశాఖ కార్యదర్శి కటారి హుస్సేన్, నాయకులు బుర్ర ధర్మయ్య, గుణగంటి సరోజిని, కనకరత్నం, కాంచని లింగయ్య, చిన్నబోయిన మంగమ్మ, గంటా శ్రీను తదితరులు పాల్గొన్నారు.