Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం పోరాడాలి
- మతోన్మాదం, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించండి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-చర్ల
భద్రాచలం డివిజన్లో నివసిస్తున్న గిరిజనుల ప్రథమ శత్రువు బీజేపీ ప్రభుత్వం అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం చెర్ల మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నందు కార్యదర్శి కారం నరేష్ అధ్యక్షతన జరిగిన జన చైతన్య యాత్ర భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బిజెపి అరాచకాలను ఎండగట్టారు. దశాబ్దాలుగా చెట్టూ, పుట్టను నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజనులను ఆర్ఎస్ఎస్ నియమాలను సారంగా ఆదివాసీలను, అరణ్యాల్లో ఉండేవారని అభివర్ణించడం మినహా వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ, జీవనోపాధి కల్పించడంలో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఆదివాసీ యువతకు కావాల్సిన విద్య అందించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతుందని ఆయన విమర్శించారు.
2019 ఎన్నికల్లో నల్లధనాన్ని వెనకిక తెస్తానని ప్రతి కుటుంబానికి జీరో అకౌంట్లో ఓపెన్ చేపించి తమ తమ ఎకౌంట్లో 15 లక్షల రూపాయలు వచ్చేటట్లు చేస్తానని నమ్మబలికి ఇంతకాలం అయినా 15 రూపాయలు కూడా వేయలేదని ఆయన ధ్వజమెత్తారు. వేలలో ఉద్యోగాలు ఇస్తామని పరిశ్రమలు నెలకొల్పుతామని ఎన్నో మాయ మాటలు చెప్పి ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తుందని ఆయన విరుచుకుపడ్డారు.
బీజేపీ పాలనలో భారతదేశ విద్యావ్యవస్థ 30వ స్థానంలో ప్రపంచ మానవ అభివృద్ధి ఆకలి సూచికలో మన దేశం 141వ స్థానంలో ఉందని ప్రణాళిక బద్ధకంగా పరిపాలించకపోవడం వలన ఎన్నో అనార్థకాలు జరుగుతున్నాయని తమ్మినేని ధ్వజమెత్తారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గిజనేతర యువత భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న తప్పుడు నిర్ణయాలేనని ఆయన అన్నారు. హిందువుల పార్టీ అంటూనే వ్యాపార రంగాన్ని నీరుగారుస్తూ అధిక ధరలు తెచ్చిపెట్టి సామాన్యుని నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. మతసామరస్యానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కల్పించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందంజలో ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జన చైతన్య యాత్ర వాహనాల నిర్వాహక ఇన్చార్జి కే.పుల్లయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యులు బ్రహ్మచారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చిమలమర్రి మురళీకృష్ణ, ఉపసర్పంచ్ శివ లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు దొడ్డి హరినాగ వర్మ, పొడుపు గంటి సమ్మక్క, మచ్చ రామారావు, బందెల చంటి, సరోని, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బుక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం కోసం సమరం తప్పదు
ఎన్నో తరాలుగా ఎందరో తేగాల ఫలితంగా వచ్చిన రిజర్వేషన్లు నీరుగారిచేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకొన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ, బీసీలు కోల్పోతున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలి.
- మచ్చా వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు
బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు విశ్రమించేది లేదు
అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్స్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జన చైతన్య యాత్ర ఈనెల 17న వరంగల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రారంభించారు. యాత్ర హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం, సూర్యాపేట, రంగా రడ్డి జిల్లాల మీదుగా ప్రయాణించి 29న హైదరా బాదు లో ముగింపు సభ జరుగుతుంది. మేధావులు, విద్యావే త్తలు, యువత ఆయా ప్రాంతాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొని బిజెపి ప్రభుత్వ అంతు చూడాలి.
- పోతినేని సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,జన చైతన్య యాత్ర రథసారథి
బీజేపీ గుండెలో దడ పుట్టిస్తున్న బైక్ ర్యాలీ
నిరుపేద నడ్డి విరిచే విధంగా పాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వ అంతు చూసేందుకు సిపిఎం చేపట్టిన జన చైతన్య యాత్రను చూచి బిజెపి గుండెల్లో దడ పుడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెందిన ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగ సంఘాలు నరేంద్ర మోడీ పాలనకు చరమగీతం పాడాల్సిందే అని ముక్తకంఠంతో నినాదిస్తున్నారు. ఆదివారం మండల సరిహద్దు సుమ్మంపేట గ్రామం నుండి రెడ్ సెల్యూట్ తో బైక్ ర్యాలీని మండలంలోకి ఆహ్వానించిన సిపిఎం నాయకులు ప్రధాన సెంటర్ మీదుగా బహిరంగ సభ వేదిక బస్టాండ్ సెంటర్ కు పెద్ద ఎత్తున మోటార్ల సైకిల్ తో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా ఈ బైక్ ర్యాలీకి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వర్లు, అడగర్ల తాతాజీ రాము సంఘీభావం తెలిపి పోతినేని సుదర్శన్ రావుకు పూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు.