Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్ల : ఈ నెల 17వ తారీఖున ప్రారంభమైన జనచైతన్య యాత్రలో భాగంగా ఆది, సోమవారాలు జరిగిన వివిధ కార్యక్రమాలతో చెర్ల మొత్తం ఎటు చూసినా అరుణమయంగా మారింది. ఉత్తేజపరిచే పాటలు, కళా నృత్యాల నడుమ జనచైతన్య యాత్ర సోమవారం మండలాన్ని వీడి దుమ్ముగూడెం మండలంలోకి ప్రవేశించింది. జన చైతన్య యాత్ర కొనసాగినంతసేపు కేంద్ర బీజేపీపై వ్యతిరేక నినాదాలు..నరేంద్ర మోడీ గద్దె దిగాలని ముక్త కంఠంతో నినాదాలు హౌరెత్తాయి. సీపీఐ(ఎం) జిందాబాద్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ ఎర్రసైన్యం నినాదాలు తూర్లను ఆలోచింపజేసింది. ఏజెన్సీ వాసులను చైతన్య పరుస్తూ కదిలిన జన చైతన్య యాత్ర పర్ణశాల వద్ద దుమ్ముగూడెంలో ప్రవేశించి అక్కడ నుండి దుమ్ముగూడెం మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.
జన చైతన్య యాత్రలో ఆటో ర్యాలీ ప్రత్యేక ఆకర్షణ
ఆదివారం బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభ అనంతరం కళాబృందాలు ద్విచక్ర వాహనాల సోధకులు చర్ల మండల కేంద్రంలో బస చేసి సోమవారం ఉదయం రాలీగా వెళుతున్న క్రమంలో సీఐటీయూ ఆటో యూనియన్ నాయకులు పామారు బాలాజీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆటోలు అరుణ పతాకాలను తమ తమ ఆటోలకు కట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వెళ్తుంటే ప్రజలు ఎంతో చైతన్యవంతంగా వీక్షించడం జరిగింది. జనచైతన్య యాత్ర ద్విచక్ర వాహనాల ర్యాలీలో రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ద్విచక్ర వాహనాలు నడిపి ఎర్రసైన్యాన్ని ఉత్తేజపరిచారు. ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్,కే. పుల్లయ్య, కే.బ్రహ్మచారి, చీమలమర్రి మురళీకృష్ణ, కారం నరేష్, ఉపసర్పంచ్ శివ లక్ష్మీనారాయణ, వార్డ్ సభ్యులు దొడ్డి హరి నాగ వర్మ, మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు పొడుపుగంటి సమ్మక్క, తాటి నాగమణి, బందెల చంటి, సూరమ్మ, ఐద్వా ఉపాధ్యక్షురాలు తిప్పనపల్లి శశికళ, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.