Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుమ్ముగూడెం : కాషాయమూక బీజేపీని గద్దె దించేందుకు లౌకిక వాద శక్తులు ఏకం కావాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకు వెళ్లి ప్రజలను చైతన్య పరిచేందుకు సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న హన్మకొండల్లో ప్రారంభమైన సిపిఐ(ఎం) ప్రజా చైతన్య యాత్ర సోమవారం దుమ్ముగూడెం మండలానికి చేరుకుంది. యాత్ర బృందానికి పార్టీ శ్రేణులు ముసలిముడుగు గ్రామం వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం వందలాది ద్విచక్రవాహనాలు, ఆటోల ర్యాలీతో లకీëనగరం చేరుకున్నారు. అనంతరం యలమంచి సీతారామయ్య స్థూపం వద్ద సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని మాట్లాడారు. ఎర్రజెండా ఉద్యమానికి దుమ్ముగూడెం పెట్టని కోట అని మార్కిస్టు మేధావి యలమంచి సీతారామయ్య ఆశయ సాధన కోసం ఎర్రజెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనక య్య, సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, కె బ్రహ్మాచారి, జిల్లా నాయకులు యలమంచి వంశీకృష్ణ, కొర్సా చిలకమ్మ, మర్మం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
బకాసురుడిని మించిన నరరూప రాక్షసుడు మోడీ : పోతినేని
బకాసురుడిని మించిన నరరూప రాక్షసుడు నరేంద్రమోడీ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. రైతులకు వ్యతిరేకంగా మూడు నల్లచట్టాలు తీసుకు వచ్చి 760 మంది రైతులను పొట్టన పెట్టుకున్న ఘనుడు నరేంద్రమోడీ అని ఆయన ఆరోపించారు. సోమవారం లకీëనగరం యలమంచి సీతారామయ్య స్థూపం వద్ద సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షతన సీపీఐ(ఎం) ప్రజా చైతన్య యాత్ర సభ జరిగింది. ఈ సందర్బంగా పోతినేని మాట్లాడారు.