Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్తంభించిన రాకపోకలు
- నిరసన కారులకు మద్దతుగా కాంగ్రెస్
- ఎంపీఈఓ సమాధానంతో ముగిసిన నిరసన
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండలంలోని బచ్చు వారి గూడెం పంచాయతీ జెట్టి వారి గుంపుకు గత 15 రోజులుగా మిషన్ భగీరథ పథకం తాగు నీరు రావడంలేదని గిరిజన మహిళలు సోమవారం నారాయణపురం-వెలేరుపాడు రోడ్డు పై ధర్నా చేపట్టారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు తెలిపి పార్టీ ముఖ్య నాయకులు నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 3 గంటలు పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదే సమయంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు వెలేరుపాడు వెళ్ళి వస్తూ గిరిజనులు పక్షాన అధికారులతో ఫోన్ మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ టీపీసీసీ సభ్యురాలు వగ్గెల పూజ, దంజు నాయక్, మొగుళ్ళపు చెన్నకేశవరావు, వేముల భారతిలు ఆందోళన కారులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంపీఈఓ సీతారామరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మంచినీటి ప్రత్యామ్నాయం చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన ముగించారు. ఈ కార్యక్రమంలో బండారు మహేష్, దాసరి రవి, పసుపులేటి నరేష్‌లు పాల్గొన్నారు.