Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-ఇల్లందు
గత మూడేళ్లుగా రాజీవ్ నగర్ శివారు ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలకు తాగునీరు, కరెంటు, ఇంటి నంబర్లు, మౌళిక సదుపాయాలు కల్పించకుండా కక్షపూరితంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం మహబూబాబాద్ రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం దరావత్ రాందాస్ అధ్యక్షతన జరిగిన సభలో నబీ మాట్లాడుతూ రాజీవ్ నగర్ గుడిసె వాసులపై ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇళ్ళు లేని నిరుపేదలు పక్షాన పార్టీ అండగా నిలిచిన పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం మోహన్ రావు, రాందాస్, వెంకన్న, వీరస్వామి, కాంతి, సుధాకర్, రమేష్, శంకర్, రాజు, హతిరం, ఈశ్వర, కౌసల్య, సుజాత, సారమ్మ, లలిత, కేశ్యా సాంకు, అమ్మి, చాందినీ, గొబ్రియా, కోటమ్మ, అనూష, మంగ తదితరులు పాల్గొన్నారు.